ఆంధ్ర ప్రదేశ్లో జంతు సంరక్షణ సంస్థ అయిన బ్లూ క్రాస్ ని ముందుండి నడిపించే వాళ్ళలో అమల అక్కినేని ఒక్కరు. అమల అక్కినేని జంతువుల హక్కుల గురించి పోరాడుతున్నారు. ఈ ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్రంతో తిరిగి తెర మీదకు వచ్చారు. ఈ మధ్యనే అమలలోని మరో కోణం బయటపడింది. ఆమె ఒక స్కూల్ లో రెండవ మరియు మూడవ తరగతి పిల్లలకు జంతువుల గురించి చెప్పారు. గత 20 ఏళ్ళుగా ఇలా తరగతులు చెప్తున్నట్టు తెలుస్తుంది. “జంతువుల గురించి చిన్న పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇది మనుషులకు జంతువుల మధ్య విరిగిపోయిన బంధాన్ని బాగు చేస్తుంది ” అని అమల ఒకానొక ప్రముఖ పత్రికతో అన్నారు. అమల గారిని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందించాల్సిందే కదూ.