ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఫుల్ హ్యాపీగా ఉంది అందాల భామ హన్సిక. ఇటీవలే విడుదలైన ‘దేనికైనా రెడీ’ సినిమాతో హిట్ అందుకున్న హన్సిక అంతకముందు తన కెరీర్లో వరుస పరాజయాల్ని అందుకుంది. అందుకే ఈ భామ ఓటమి వచ్చినప్పుడు ఆశ వదులుకోకూడదు అని అంటోంది. ‘ మన మదిలో దేవుడు నాకే ఎందుకిలా చేస్తున్నాడు? ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని లైఫ్ లో ముందు కెళితే మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోలేము. పరాజయాన్ని కూడా ఆనందంగా తీసుకోవాలి మన వంతు కూడా వస్తుందని వేచి చూడాలి. కానీ మనకి వచ్చిన అవకాశం సక్సెస్ అయినప్పుడు లైఫ్ చాలా ఆనందంగా ఉంటుందని’ హన్సిక అంది. ప్రస్తుతం హన్సిక సింగం 2′ లో నటిస్తోంది. మన పాజిటివ్ మెంటాలిటీనే మనం ఎక్కువ సక్సెస్ అందుకోవడానికి హెల్ప్ అవుతుంది. హన్సిక ఇలా లైఫ్ గురుంచి పాఠాలు చెబుతోంది.