“ఓయ్” చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయిన ఆనంద్ రంగ “రాండమ్ థాట్స్” అనే నూతన నిర్మాణ సంస్థను స్థాపించారు. గతంలో “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం” వంటి చిత్రానికి నిర్మాతగా ఉన్న శేషు రెడ్డి తో జత కలిసి ఆనంద్ రంగ ఈ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఆనంద్ రంగ, శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో రానున్న “పొగ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ మధ్యనే అయన తరువాత చిత్రంలో కొత్త ప్రతిభను పరిచయం చేస్తాను అని ప్రకటించారు. ఈ రెండు చిత్రాలు కాకుండా అయన సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో రానున్న మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. నూతన దర్శకుడు దర్శకత్వం వహించబోయే ఈ చిత్రం కచ్చితంగా విజయం సదిస్తుందని ఆనంద్ రంగ ధీమాగా ఉన్నారు. 2013 ముగింపు కి ఆనంద్ రంగ మరియు శేషు వాళ్ళ బ్యానర్ లో మూడు చిత్రాలను విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు.