
ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ల జాబితాలో పార్వతి మెల్టన్ కూడా చోటు సంపాదించుకోబోతుంది. ముంబై కి చెందిన బిల్డర్ శంసు లలాని, పార్వతి మెల్టన్ మధ్య గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది. వీరి ప్రేమ పెళ్లి వరకు దారి తీసింది. డిసెంబర్ 29న ముంబైలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సమాచారం ఆమె సన్నిహితులకి, స్నేహితులకి చెప్పినట్లు సమాచారం. వెన్నెల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పార్వతి మెల్టన్ గేమ్, అల్లరే అల్లరి సినిమాల్లో కథానాయికగా నటించి మధుమాసం, జల్సా సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేసింది. దూకుడు సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించి శ్రీమన్నారాయణ సినిమాలో బాలయ్య సరసన సెకండ్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం సాయి రామ్ శంకర్ సరసన యమహో యమః సినిమాలో నటించింది. ఈ సినిమా డిసెంబర్ 14న విడుదల కాబోతుంది.