అందాల తార నయనతార గత సంవత్సరం తన పర్సనల్ లైఫ్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కొంది అవి తన కెరీర్ పై కూడా ప్రభావం చూపాయి. ఆ తర్వాత పబ్లిక్ ఈవెంట్స్ లో గాని మరియు పబ్లిక్‌లో కనిపించడం గానీ చాలా తక్కువ. ఎదో ఒకటి లేదా రెండు ఈవెంట్స్ లో కనిపించారు అందులో కూడా ఆమె సంతృప్తిగా కనిపించలేదు. మళ్ళీ ఆమె కెరీర్ పై దృష్టి పెట్టి చేసిన మొదటి సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్’ విడుదలై మంచి సక్సెస్ అందుకోవడం మరియు ఆమెకి మంచి ప్రశంశలు దక్కడంతో నయనతార చాలా ఆనందంగా ఉంది.
నయన్ ఆనందాన్ని మీరు పై ఫోటోలో చూడవచ్చు, ఈ సంఘటన నిన్న హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్లో చోటు చేసుకుంది. ఈ ఈవెంట్లో నయనతారా చాలా ఆనందంగా మరియు ఉత్సాహంతో కనిపించారు. ఫేమస్ అమెరికన్ నటి ఫిల్లిస్ డిల్లెర్ ఓ సందర్భంలో ‘ స్మైల్ అనేది చూడటానికి వంకరగానే ఉంటుంది కానీ అది అన్ని విషయాలను చక్కబెడుతుందని’ అంది, ఆమె అన్నది చాలా కరెక్ట్.