ఈ రోజే డా. డి. రామానాయుడు మనువరాలి పెళ్లి


మూవీ మొగల్ డా. డి. రామానాయుడు మనువరాలు, డి.సురేష్ బాబు కుమార్తె మాళవిక పెళ్లి ఈ రోజు. భరత్ కృష్ణ తో ఈ రోజు సాయంత్రం ఈ వివాహ మహోత్సవం జరగనుంది. ఈ వేడుకకోసం నానక్రాం గూడా రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా జరగనుంది, దీని కి సంబందించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ వివాహ వేడుకకి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అతిరధమాహారధులు అంతా హాజరుకానున్నారు మరియు కొంతమంది బాలీవుడ్ తారలు కూడా వచ్చే అవకాశం ఉంది.

ఈ వివాహ ముహూర్త సమయం ఈ రోజు రాత్రి 8 గంటల 50 నిమిషాలకి, అతిధుల కోసం డిన్నర్ ఏర్పాట్లు చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఫుల్ హ్యాపీగా ఉన్న రానానే దగ్గరుండి తన సిస్టర్ పెళ్లి పనులు చూసుకుంటున్నారు.

ఈ నూతన దంపతులకి 123తెలుగు.కామ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version