దేవరాయ చూసాక శ్రీకాంత్ చెండాలంగా చేసాడని ఎవరూ అనరు

ఫ్యామిలీ చిత్రాల హీరో లేటెస్ట్ మూవీ దేవరాయ.ఈ సినిమా గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ దర్శకుడు నానికి ఇది మొదటి సినిమా. మొదట నా దగ్గరికి వచ్చినపుడు కొన్ని కథలు చెప్పాడు. అవేవి కాదు ఏదైనా వెరైటీగా ఉండేలా కథ రెడీ చేయమన్నాను. కృష్ణదేవరాయలు నేపధ్యంగా ఒక చెప్పాడు. వెంటనే నచ్చి ఓకే చేశాను. నానికి ఇది మొదటి సినిమా అయినా అధ్బుతంగా తీసి చూపించాడు. దేవరాయ పాత్ర బాడీ లాంగ్వేజ్ కోసం ఎన్టీరామారావు గారు, నాగేశ్వర రావు గారి పాత సినిమాలు చూసాను. ఆ పాత్ర కోసం చాలా హోం వర్క్ చేశాను. కేవలం మేకప్ కోసమే రెండు గంటలు సమయం పట్టేది. ఇలాంటి సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీలకం. చక్రి అధ్బుతమైన సంగీతం అందించాడు. ఈ సినిమా చూసాక ఎవరూ కూడా శ్రీకాంత్ చెండాలంగా చేసాడని అనరు. ఈ పాత్రకి 100% న్యాయం చేసాననే నమ్మకం నాకుంది. ఈ నెల 7న దేవరాయ సినిమా కాబోతుంది.

Exit mobile version