పద్మ అవార్డులకు బాపు పేరు


ప్రముఖ దర్శకుడు బాపు గారి పేరును పద్మ భూషణ్ అవార్డుల కోసం ప్రభుత్వం ఆయన పేరును సిఫార్సు చేసింది. ఇప్పటి వరకు ఆయనకు ఒక్క పద్మ అవార్డు కూడా రాకపోవడం భాధాకరం. గత కొంత కాలంగా బాపు గారికి ఏ అవార్డు దక్కలేదు. పద్మభూషణ్ అవార్డు కోసం అయన పేరుని పంపించారు. పద్మ అవార్డులకు 50 మంది పేర్లు ప్రభుత్వానికి పంపగా బాపు పేరుతో పాటుగా శ్రీపాద పినాకపాణి, సి. నారాయణ రెడ్డి లకు పద్మ విభూషణ్ అందజేయాలని సూచించారు. వీరితో పాటుగా డి. రామానాయుడు, బి.వి.ఆర్ మోహన్ రెడ్డి, తుర్లపాటి కుటుంబరావు లకు పద్మ భూషణ్ అవార్డు కోసం మరికొంత మంది పేర్లను సిఫార్సు చేసారు.

Exit mobile version