దుబాయ్ లో నాని – కృష్ణ వంశిల చిత్రం


కృష్ణ వంశీ దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్ర చిత్రీకరణ ఈ మధ్యనే దుబాయ్ లో మొదలయ్యింది.కేథరిన్ తెరెసా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రమేష్ పుప్పల నిర్మిస్తున్నారు రెండు పాటల మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. ఈ చిత్ర బృందం డిసెంబర్ రెండవ వారంలో చిత్రీకరణ పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగిరానుంది. ఈ చిత్ర టైటిల్ ఇంకా ఖరారు కాలేదు “పైసా” అనే పేరుని పరిశీలిస్తున్నారు. నాని ఈ చిత్రంలో ఓల్డ్ సిటీ లో మోడల్ గా కనిపించనున్నారు రాజకీయ అంశాలకు దగ్గరగా సాగే కథ ఇది. చాల రోజుల నుండి విజయం కోసం తపిస్తున్న కృష్ణ వంశీ ఈ చిత్రంతో విజయబాట పట్టాలని కష్టపడుతున్నారు. ఈ చిత్రం 2013 మొదట్లో విడుదల కానుంది.

Exit mobile version