
ఆ ఇద్దరు ప్రస్తుత జెనరేషన్ కి మినిమం గ్యారంటీ హీరోస్ అందులో ఒకరు విజయ పథంలో నడుస్తుండగా మరొకరు విజయం కోసం వేచి చూస్తున్నారు. వారిద్దరూ మరెవరో కాదు కామెడి కింగ్ అల్లరి నరేష్ మరియు మాస్ మహారాజ రవితేజ. వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద డిసెంబర్ 21న పోటీ పడనున్నారు. “యముడికి మొగుడు” వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో నరేష్ ప్రేక్షకుల ముందుకి వస్తుండగా, రొమాంటిక్ ఎంటర్ టైనర్ “సారోచ్చారు” చిత్రంతో రవితేజ అదే రోజున ప్రేక్షకుల ముందుకి రానున్నారు. రెండు చిత్రాలలో కామెడీ శాతం ఎక్కువగానే ఉండబోతుంది. ఈ రెండు చిత్రాలలో బాక్స్ ఆఫీస్ వద్ద ఏ చిత్రం విజయం సాదిస్తుందో చూడాలి. ఇలా ఇద్దరు మినిమం గ్యారంటీ హీరోఅల్ చిత్రం ఒకే రోజున విడుదల అవుతుండటం ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.