చెన్నై ఫిలిం ఫెస్టివల్ లో రాజమౌళి ఈగ


ఎస్ ఎస్ రాజమౌళి ఈ మధ్య తెలుగు పరిశ్రమకు అందించిన భారీ విజయం “ఈగ” 10వ చెన్నై ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడుతుంది. ఈ ఫెస్టివల్ లో కొన్ని చిత్రాల కోసం ప్రత్యేకించి ఒక సెక్షన్ ఏర్పాటు చేశారు ఇందులో ఈగ చిత్ర తమిళ వెర్షన్ “నాన్ ఈ” ప్రదర్శించబడుతుంది. “పిజ్జా”,”ఆరవన్”, “ఆరోహణం” ,”అట్టకత్తి “, “సట్టై” తదితర చిత్రాలతో ఈ చిత్రం పోటీపడనుంది. డిసెంబర్ 13 నుండి డిసెంబర్ 20 వరకు జరగబోయే ఈ ఫిలిం ఫెస్టివల్ లో 57 దేశాలనుండి 160 చిత్రాలను ప్రదర్శించనున్నారు.

“నాన్ ఈ” చిత్రం తమిళనాడులో భారీ విజయం సాదించి ప్రసాద్ వి పోట్లురి కి లాభాలు చేకూర్చాయి. తమిళంలో ఈ విజయం రాజమౌళి గారు మరిన్ని ద్విభాషా చిత్రాలను చేసే అవకాశాన్ని సృష్టించింది. ఇప్పటికే అయన చెయ్యబోయే ప్రభాస్ చిత్రాన్ని తెలుగు,తమిళ మరియు హిందీలలో విడుదల చేయ్యనున్నారని ప్రకటించారు. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది చిత్రీకరణ 2013 మొదట్లో ప్రారంభం కానుంది.

Exit mobile version