ఫిబ్రవరిలో రానున్న ప్రభాస్ మిర్చి.!


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘మిర్చి’ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మాటల రచయిత కొరటాల శివ దర్శకుడిగా మారి చేస్తున్న మొదటి సినిమా ఇది. వంశీ కృష్ణా రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాని డిసెంబర్ చివరిలో విడుదల చేయాలనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరికి వాయిదా పడింది.

Exit mobile version