కృష్ణం వందే…. ఎవరికీ ఎక్కువ లాభం అయింది?


చాలా రోజుల నుండి వేచి చూస్తున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురుమ్” నిన్న విడుదలయ్యి అందరి మన్ననలను అందుకుంది. కాని ఇద్దరు ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నారు వారు రానా మరియు సాయి మాధవ్ బుర్ర. వీరికి ఈ చిత్రం చాలా లాభాన్ని చేకూర్చింది దర్శకుడు క్రిష్, నయనతార మరియు మణిశర్మ కూడా ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించారు కాని వారు ఇప్పటికే పరిశ్రమలో వారిని నిరూపించేసుకున్నారు. కాని రానా మరియు సాయి మాధవ్ ఈ చిత్రంతో సినిమా ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఇది ఆరికి చాలా ఉపయోగపడనుంది. ఈ చిత్రం క్లైమాక్స్లో లక్ష్మి నరసింహ అవతారంలో రానా పరిపక్వతతో కూడిన నటన ప్రదర్శించారు ఇది అయన కెరీర్లోనే ఉత్తమం అని చెప్పచ్చు.

ఇక డైలాగ్స్ విషయంలో సాయి మాధవ్ సన్నివేశానికి కావలసినంత బలన్ని ఇచ్చారు. “మనం చచ్చాక కూడా మనం బతికుంటే బాగుండేది అనుకునేవాళ్లు ఎక్కువ ఉంటె మనం బతికున్నట్టే… మనం బతుకున్నప్పుడే మనం చచ్చిపోతే బాగుణ్ణు అని ఎక్కువమంది అనుకుంటే మనం చచ్చినట్టే లెక్క” వంటి మనసుని తాకే సంభాషణలు చిత్రంలో చాలానే ఉన్నాయి. ఇలానే ఆలోచింపజేసే మరిన్ని డైలాగ్స్ తో మన ముందుకి రావాలని ఆశిద్దాం.

Exit mobile version