సీతమ్మ వాకిట్లో… విడుదలలో ఎలాంటి మార్పు లేదు


విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా విడుదలలో ఎలాంటి మార్పు లేకుండా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మల్టీ స్టారర్ మూవీని సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో డిసెంబర్ 13న విడుదల కానుంది మరియు త్వరలోనే ఆడియో వేదిక ఎక్కడనేది తెలియజేయనున్నారు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

డిసెంబర్ మొదటి వారంలో మహేష్ బాబు – సమంత లపై ఓ పాటను చిత్రీకరించనున్నారు. వెంకీ మరియు మహేష్ బాబులకి తల్లి తండ్రులుగా ప్రకాష్ రాజ్ – జయసుధ కనిపించనున్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. సమంత మరియు అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version