కొత్త దర్శకుడికి అల్లు అరవింద్ ఆఫర్ !

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో రాబోతున్న సినిమా ‘‘పలాస 1978” . తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకం పై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అయితే ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. జిఎ2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే హిట్ టాక్ తెచ్చేసుకుంది. అప్పుడే ఈ సినిమా దర్శకుడికి పెద్ద ప్రొడ్యూసర్స్ అవకాశాలు ఇచ్చేస్తున్నారు.

నిన్న, అల్లు అరవింద్ పలాసా 1978 ను ప్రత్యేక ప్రివ్యూ షో వేసుకుని చూశారు. సినిమా ఆయనకి బాగా నచ్చింది. ముఖ్యంగా దర్శకుడు కరుణ కుమార్ పనితనం బాగా ఆకట్టుకుందని ఆయన ప్రశంసించారు. పైగా ఈ కొత్త దర్శకుడికి ఆఫర్ కూడా ఇచ్చాడు. తన గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఒక చిత్రానికి దర్శకత్వం వహించాలని అల్లు అరవింద్ కరుణకు ఆఫర్ ఇచ్చారు. పలాసా 1978 విడుదలైయ్యాక ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Exit mobile version