నాని నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘హిట్’. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.1.3 కోట్ల షేర్ అందుకున్న ఈ చిత్రం నిన్న రెండవ రోజు కూడా నిలకడగా వసూళ్లను రాబట్టింది. నైజాంలో రూ.67 లక్షలు, సీడెడ్లో రూ.9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.11 లక్షలు, ఉభయగోదావరి జిల్లాల్లో రూ.10 లక్షలు, గుంటూరులో రూ.4 లక్షలు, కృష్ణాలో రూ.5 లక్షలు, నెల్లూరులో రూ.3 లక్షలు కలిపి మొత్తంగా రూ.1.09 కోట్ల షేర్ ఖాతాలో వేసుకుంది.
ఇక ఈరోజు ఆదివారం కావడంతో వసూళ్లు ఇలాగే స్టడీగా ఉండే అవకాశం ఉంది. చిత్రం వీక్ డేస్ లో సైతం ఇదే రన్ కనబరిస్తే ఇంకో రెండు రోజుల్లో లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈమధ్య కాలంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్లో రూపొందే చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో విడుదలకావడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.
ఇందులో విశ్వక సేన్ హీరోగా నటించగా రుహాని శర్మ కథానాయకిగా నటించింది.