యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి అరుదైన అవకాశం


ఫిల్మ్ మేకర్స్ కావాలనుకునే చాలా మందికి రాబోయే కొన్ని వారాల్లో తమ డ్రీమ్ ని నిజం చేసుకునే అవకాశం ఉంది. అవును మీరు వింటున్నది నిజమే.. మీరు వెతుక్కొని వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఫిల్మ్ ఇండస్ట్రీనే మీకు అవకాశం కల్పించనుంది. మీరు చేయాల్సింది మీ టాలెంట్ ని నిరూపించుకోవడమే. ఇక విషయంలోకి వెళితే ప్రముఖ టీవీ చానల్ అయిన మా టీవీ త్వరలోనే ‘షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్’ అని ఒక కార్యక్రమం నిర్వహించనుంది. ఫిల్మ్ మేకర్స్ కావాలనుకునే వారికిదొక సరైన వేదిక. సుమారు నెల రోజుల పాటు జరిగే ఈ కాంటెస్ట్ లో వచ్చిన వాటిలో ఉత్తమమైన వాటిని మా టీవీ వారి ఎదో ఒక చానల్లో ప్రసారం చేస్తారు. ఇందులో ఒక్క మా టీవీ వారు మాత్రమే కాకుండా , సంగమిత్రా ఆర్ట్స్ (పవన్ కళ్యాన్ తో ‘పంజా’ చేసిన ప్రొడక్షన్) వారు ఒక కార్పోరేట్ సంస్థతో కలిసి ఒక కొత్త రియాలిటీ షో కోసం ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు.

నీలిమ తిరుమల శెట్టి ఈ విషయం గురించి తెలియజేస్తూ ‘ సంగమిత్రా ఆర్ట్స్ వారు ఒక కార్పోరేట్ సంస్థతో కలిసి, ఒక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్ ఆధ్వర్యంలో ‘ఎ ఫిల్మ్ బై?’ అనే ఒక రియాలిటీ షో చేయనున్నాము. ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకొని మీ కలను నిజం చేసుకోండి, అలాగే ఎంతో మంది వీక్షకుల అభిమానాన్ని గెలుచుకోండి. ఈ షో కోసం దేశవ్యాప్తంగా ఫిలిం మేకర్స్ అవ్వాలని కోరిక ఉన్నవారిని ఆహానిస్తున్నామని’ ఆమె ట్వీట్ చేసారు. ఈ షోకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Exit mobile version