విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా నటించిన ‘శివ తాండవం’ చిత్ర ఆడియో సెప్టెంబర్ 11న హైదరాబాద్లో జరగనుంది. యోగా బ్యూటీ అనుష్క కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, అమీ జాక్సన్ మరియు లక్ష్మీ రాయ్ కీలక పాత్రాల్లో కనిపించనున్నారు. ‘నాన్న’ మరియు ‘1947 ఎ లవ్ స్టొరీ’ చిత్రాలకి దర్శకత్వం వహించిన ఎ.ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని యు.టి.వి ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పణలో తేజ సినిమా బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. తమిళనాడులో ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. విక్రమ్ ఈ చిత్రంలో అంధుడైన ఒక సీక్రెట్ ఏజెంట్ పాత్ర పోషించారు. అంధుడైన విక్రమ్ ఎకోలేషన్ టెక్నిక్ ని వాడి ఎలా తన లక్ష్యాన్ని సాదించారనేదే చిత్ర కథాంశం. జి.వి ప్రకాష్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నారు.