పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం మోహన్ బాబు రాబోతున్న చిత్రం “రావణ బ్రహ్మ” చిత్రంలో శ్రియ ప్రధాన పాత్ర పోషించనుంది గత సంవత్సరం మోహన్ బాబు, రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రావణుడి పాత్రలో ఒక పౌరాణిక చిత్రం చేయ్యబోతున్నారని ప్రకటించారు. మోహన్ బాబు చిత్రంలో శ్రియ కనపడటం ఇదే మొదటి సారి పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం చిత్రాన్ని తెలుగు ,తమిళ మరియు హిందీ భాషలలో అగ్ర తారలతో నింపేయాలన్న ఆలోచనలో మోహన్ బాబు ఉన్నట్టు తెలుస్తుంది ఒక ప్రముఖ జాతీయ పత్రిక కథనం ప్రకారం చిత్రంలో కీలక పాత్ర కోసం మోహన్ బాబు శ్రీ దేవి ని సంప్రదించినట్టు ప్రకటించింది కాని అది ధృవీకరించని వార్త. “లార్డ్ ఆఫ్ ది రింగ్స్” చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చెయ్యనున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు .