నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఏవీఎస్ నిర్మాతగా, దర్శకుడిగా, స్క్రీన్ప్లే రచయితగా కూడా పని చేసారు. ఆయన www.avsfilm.in అనే బ్లాగ్ పెట్టి సామాజిక, చలనచిత్ర, రాజకీయ పలు రంగాలకు సంభందించిన అంశాలపై తన స్పందనను తెలియజేస్తున్నారు. తన బ్లాగుకి 35 వేలకి పైగా పేజి వ్యూస్ రావడం, ఈ బ్లాగ్ ద్వారా బ్లాగ్ బస్టర్ అవార్డ్స్ అందించబోతున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయగా, ఈ వేడుకకు దాసరి నారాయణ రావు, ఏవీఎస్, మురళి మోహన్, సాగర్, జయప్రకాశ్ నారాయణ, బూరుగుపల్లి శివరామకృష్ణ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు వచ్చిన ప్రముఖులందరూ ఈ బ్లాగ్ సక్సెస్ కావాలని కోరుకున్నారు.