ఈ రోజు నుండి ‘ఆకాశం అమ్మాయైతే’ ప్యాచ్ వర్క్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణలో ఉన్నారు. అందులో భాగంగా ‘ఆకాశం అమ్మాయైతే’ అనే పాట ప్యాచ్ వర్క్ పూర్తి చేయనున్నారు. నిన్న కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఆధ్వర్యంలో ‘దేఖో దేఖో గబ్బర్ సింగ్’ అనే టైటిల్ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేసారు. ఈ రోజు మరియు రేపు ఈ పాట చిత్రీకరణ చేసి ఆ తరువాత మిగతా పాటల చిత్రీకరణ కోసం యూరప్ వెళ్లనున్నారు. శృతి హాసన్ కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకుడు. పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ వంటి చిత్రాన్ని నిర్మించిన బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Exit mobile version