తాప్సీ తన రాబోతున్న చిత్ర చిత్రీకరణ లో పాల్గొంటుంది చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెండవ సారి గోపీచంద్ తో జత కట్టనుంది. ఈ చిత్రంలో తన పాత్ర చాలా బాగా ఉంటుంది అని చిత్రంలో ఈ పాత్రను చంద్రశేఖర్ ఏలేటి ఎలా చుపించబోతున్నారో అని ఆసక్తి కరంగా వేచి చూస్తున్నా అని తాప్సీ వెల్లడించారు. ఈ పాత్రను తనొక చాలెంజ్ గా తీసుకొని చేస్తున్నట్టు తెలుస్తుంది. శంధత్ సినిమాటోగ్రఫీ అందించగా శ్రీ సంగీతం అందించనున్నారు బివి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.