మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పేరు రామ్ చరణ్ తేజ్ కాదని ‘రామ్ చరణ్’ మాత్రమే అంటున్నాడు. తన తండ్రి గారైన మెగా స్టార్ చిరంజీవి తనకు రామ్ చరణ్ అనే పేరు మాత్రమే పెట్టారనీ, కానీ అందరు తనని రామ్ చరణ్ తేజ్ అని పిలుస్తున్నారని మీడియా కూడా తనని అలా పిలవొద్దని తన ట్విట్టర్ అకౌంటులో రిక్వెస్ట్ చేస్తున్నాడు. రామ్ చరణ్ ఇటీవలే రచ్చ సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. రచ్చ విజయం ఇచ్చిన ఉత్సాహంతో వివి వినాయక డైరెక్షన్లో ఒక సినిమా, వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ‘ఎవడు’ మరియు బాలీవుడ్లో అపూర్వ లఖియా డైరెక్షన్లో జంజీర్ సినిమాల్లో నటిస్తున్నాడు.