రవితేజతో ‘సారోస్తారా’ అంటున్న అమలా పాల్

మాస్ మహారాజ రవితేజ హీరోగా పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రంలో రవితేజ సరసన అమలా పాల్ నటించనుంది. ‘సారోస్తారా’ అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రంలో మొదటగా నిత్య మీనన్, త్రిషా లతో సంప్రదింపులు జరిపారు. ఒక దశలో పరుల్ యాదవ్ కూడా అనుకున్నారు. కాని చివరకు అమలా పాల్ ని ఖరారు చేసారు. ఆమె ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ వెల్లడించారు. అమలా పాల్ ‘నాన్న’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాతో దగ్గరయింది. ఇదే కాకుండా రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో రెండవ హీరొయిన్ గా కూడా ఎంపికయింది.

Exit mobile version