అక్కినేని నాగార్జున ప్రతిభ ఉన్న కొత్త వారిని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఆయన ఇప్పటి వరకు పలువురు కొత్త నటీనటులని, సాంకేతిక నిపుణులని తన సినిమా ద్వారానే కాకుండా బయట సినిమాల నుండి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేసారు. తాజా సమాచారం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ కోసం ఆయన కొంత సమయాన్ని కేటాయించాబోతున్నారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ లోని విద్యార్ధుల సమయం కేటాయించి వారికీ కొన్ని పాఠాలు చెప్పనున్నట్లు తెలిపారు. నాగార్జున ప్రస్తుతం కె. రాఘవేంద్ర రావు డైరెక్షన్లో శిరిడి సాయి సినిమాలో నటిస్తున్నాడు.