మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘దరువు’ సినిమాలో బ్రహ్మానందం విద్యా బాలన్ అనే పాత్ర పోషించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా బ్రహ్మి ధ్రువీకరించాడు. ప్రసాద్ ల్యాబ్లో నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ తను ఈ సినిమాలో ఒక ఫుల్ లెంగ్త్ డాన్సు మాస్టర్ పాత్ర పోషిస్తున్నట్లు, ఈ పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ ఒక సన్నివేశంలో అమ్మాయి వేషం వేసాడని తను, రవితేజ, వెన్నెల కిషోర్ కలిసి నటించిన ఆ సన్నివేశం తనకు బాగా నచ్చిందనీ, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని తెలిపారు. వీరితో పాటుగా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణ కూడా మంచి పాత్రలు పోషించినట్లు తెలిపారు. విజయ్ అంటోనీ సంగీస్తం అందించిన ఈ చిత్ర పాటలు నిన్న విడుదలయ్యాయి. స్గివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించారు.