మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘దరువు’ ఆడియో వేడుక ప్రసాద్ లాబ్లో జరుగుతుండగా తెలంగాణా ప్రాంతానికి చెందిన దరువు అనే సాంస్కృతిక కళా సంస్థ వారు వచ్చి గొడవ చేసారు. దరువు అనే ఈ చిత్ర టైటిల్ ను మార్చాలి అంటూ గొడవ చేస్తూ వేడుక లోపలి దూసుకు వచ్చారు. కొంత సమయం తరువాత వారిని పంపించేయగా మళ్లీ ఆడియో వేడుక కొనసాగించారు. విజయ్ అంటోని సంగీతం అందించిన ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు. ప్రముఖ కమెడియన్ ఆడియో విడుదల చేసి మొదటి సీడీని సహజ నటి జయసుధ గారికి అందించారు. బ్రహ్మానందం మాట్లాడుతూ తను ఈ సినిమాలో ‘విద్య బాలన్’ అనే పాత్ర పోషిస్తున్నట్లు, తనతో పాటుగా వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణ చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది అన్నారు.