యంగ్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రం తెలుగుతో పాటుగా తమిళ్లో కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు. యెన్ ఎండ్రాల్ కాదల్ ఎన్బేన్ పేరుతో తెలుగుతో పాటుగా తమిళ్లో కూడా విడుదల చేయాలనీ దర్శక నిర్మాతలు భావించారు. తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టలన్న తన 8 ఏళ్ళ కల ఈ సినిమాతో ఫలించబోతుందని రామ్ అంటున్నాడు. రామ్ చెన్నై లోనే చదువు కొనసాగించడంతో తమిళ్ బాగా మాట్లాడగలడు. ఇటీవల చెన్నైలో జరిగిన ఈ చిత్ర ప్రెస్ మీట్లో రామ్ తమిళ్లో ధారాళంగా మాట్లాడటం చూసిన తమిళ దర్శకులు ఆశ్చర్యపోయారట. ఈ చిత్ర దర్శకుడు కరుణాకరన్, మ్యూజిక్ డైరెక్టర్ జ.వి ప్రకాష్ కుమార్ ఇద్దరు తమిళ్ వారె కావడం, తమన్నాకి కూడా తమిళ్లో మంచి మార్కెట్ ఉండటంతో తెలుగు సినిమా తమిళనాడులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.