పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్న సంచలనం “గబ్బర్ సింగ్”. ఈ చిత్రం ప్రస్త్తుతం ఇతం సాంగ్ చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుపుకుంటుంది. అద్బుతంగా తెరకెక్కిస్తున్న ఈ పాటలో మాకు అందిన సమాచారం ప్రకారం 100 మంది డాన్సర్ లు నృత్యం చెయ్యబోతున్నారు. ఈ పాటలో మలైకా అరోరా విభిన్నంగా కనిపించబోతున్నారు. ఇప్పటికే జనంలో కి దూసుకెళ్లిన “కెవ్వ్ కేక” పాట ఛిత్రీకరణ దాదాపుగా చివరి దశలో ఉంది. మే లో విడుదల కు సిద్దమయిన ఈ చిత్రం లో శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.