ప్రత్యేకం : ఎటో వెళ్ళిపోయింది మనసు ఆడియో అప్డేట్


నాని మరియు సమంతా జంటగా నటిస్తున్న ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్ర ఆడియో మే చివరి వారంలో విడుదలకు సిద్ధమవుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్ర ఆడియోలో మొత్తం 7 ఫుల్ సాంగ్స్ మరియు 2 బిట్ సాంగ్స్ ఉండబోతున్నాయి. యువ రచయిత అనంత శ్రీరామ్ ఈ ఆల్బంలోని మొత్తం 9 పాటలకి సాహిత్యం అందించాడు. ‘ఏ మాయ చేసావే’ వంటి స్వీట్ లవ్ స్టొరీని రూపొందించిన గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటుగా తమిళ్లో జీవాతో ‘నీథానే ఎన్ పోన్వసంతం’ హిందీలో ఆదిత్య రాయ్ కపూర్ తో ‘అస్సి నబ్బె పూరే సౌ’ పేరుతో రూపొందుతుంది. మూడు భాషల్లోనూ సమంతా హీరొయిన్ కావడం విశేషం.

Exit mobile version