విశాల్ తో చిత్రాన్ని ఒప్పుకున్న కార్తిక

కే వి ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన “రంగం” చిత్రం విజయవంతమయిన తరువాత కార్తిక ఎంపిక చేసుకున్న పాత్రలే చేస్తుంది త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీయార్ సరసన “దమ్ము” చిత్రంలో కనపడబోతున్నఈ భామ భారతిరాజ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో కనిపించబోతుంది ఇది కాకుండా తాజాగా విశాల్ తో ఒక చిత్రం ఒప్పుకున్నట్టు సమాచారం ఈ చిత్రానికి సుందర్ . సి దర్శకత్వం వహించనున్నారు ఈ చిత్రంలో విశాల్ త్రిపాత్రిభినయం చేయ్యనున్నట్టు సమాచారం కార్తిక ఈ చిత్రంలో ముగ్గురు ప్రధాన కథానాయికలలో ఒకరు. గతం లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలలోనే చేస్తాను అని చెప్పిన కార్తిక ప్రస్తుతం దమ్ము చిత్రం మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు.

Exit mobile version