తమన్ పెద్ద పెద్ద చిత్రాలతో బిజీగా ఉన్నారు కొన్ని పెద్ద చిత్రాలకు రికార్డింగ్ కూడా మొదలు పెట్టేశారు. ప్రస్తుతం వెంకటేష్ “షాడో”, వి.వి.వినాయక చిత్రం మరియు “బాద్షా” చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు ఏకాన్ తో కలిసి పని చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో ఏకాన్ రా.వన్ చిత్రంలో “చమ్మకు చల్లో” పాట పాడారు. “ఈ ఆల్బమ్స్ లో ఏదో ఒక దాంట్లో ఏకాన్ చేత పాడించాలి అనుకుంటున్నా. ఆ పాట బాగా వస్తుందని అనుకుంటున్నా” అని ట్విట్టర్ లో అన్నారు. ఈ చిత్రాలు కాకుండా సిద్దార్థ్ సమంతలు జోడిగా రాబోతున్న చిత్రానికి మరియు అల్లు అర్జున్ వాసు వర్మల చిత్రానికి కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు