ప్రస్తుత తరానికి చాలా అందమయిన కథానాయికలలో తమన్నా ఒకరు. తన అందంతో మరియు అభినయంతో కొన్ని వేల హృదయాలను కొలగోట్టింది ఈ భామ. కాని తన అత్యుత్తమ ప్రదర్శన “ఎందుకంటే ప్రేమంట” చిత్రంలో ఉండబోతుంది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కరుణాకరన్ తమన్నాను చాలా అందంగా చూపించారని అంటున్నారు. ఇప్పటికే విడుదలయిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం అత్యుత్తమ నిర్మాణ విలువలు మరియు సాంకేతిక విలువలతో తెరకెక్కించారు. జి.వి ప్రకాశ్ అందించిన సంగీతం ఈ నెల 21న విడుదల అవుతుంది.