కర్ణాటకలో విడుదల కాబోతున్న లవ్ ఫెయిల్యూర్


యువ నటుడు సిద్ధార్థ్ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కర్ణాటకలో ఈ శుక్రవారం విడుదల కానుంది. సిద్ధార్థ్ నిర్మాతగా మొదటి సినిమా అన్న విషయం మనకు తెలిసిందే. బెంగుళూరులో ఉండే మల్టి ప్లెక్స్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ తన బ్యానర్ పై మారి కొన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. ఈ చిత్రం ఒకేసారి చాలా ఏరియాల్లో విడుదల కాలేదు. మంచి స్పందన వస్తుండటంతో మారి కొన్ని ప్రింట్స్ తో విడుదల చేస్తున్నారు.

‘లవ్ ఫెయిల్యూర్ ‘ సినిమా విజయం లో కీలక పాత్ర దారి నా మిత్రుడు ‘చక్రవర్తి రామచంద్ర’ అన్నారు సిద్ధార్ధ. ఈ సినిమా ప్రారంభం నుంచి విడుదల వరకు ప్రతి
విషయం లోను అన్నింటా నాకు సహాయం గా ఉండి చిత్ర విజయం లో ముఖ్య భూమిక పోషించాడు. లాస్ట్ ప్రింట్ థియేటర్ కు వెళ్ళీ వరకు ఎంతో శ్రమించాడు.పక్కా ప్రణాళికతో అతను చేసిన కృషి అభినందనీయం . అతనికి ప్రత్యేక కృతఙ్ఞతలు. ‘లవ్ ఫెయిల్యూర్ ‘ చిన్న చిత్రం గా విడుదలై పెద్ద విజయం
సాధించటం లో నా మిత్రుడు భాగస్వామి కావటం నా కెంతో ఆనందంగా ఉంది. నా తదుపరి చిత్రానికి అతనే నిర్మాత. అంటూ ఎగ్జిక్యుటివ్ నిర్మాత చక్రవర్తి రామచంద్ర ను ప్రశంసించారు కధానాయకుడు సిద్ధార్ధ .

Exit mobile version