మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ‘రచ్చ’ సినిమా రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ చేస్తూ సంచలనం సృష్టిస్తుంది. మాకు అత్యంత విశ్వసనీయ వర్గాల వారి సమాచారం ప్రకారం ఈ చిత్ర అమెరికా పంపిణీ హక్కులు 2 కోట్ల 70 లక్షల రూపాయలకు అమ్ముడు పోయినట్లు చెబుతున్నారు. మార్చి చివరి వారంలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం మార్చి 4 కర్నూలులో భారీ ఎత్తున ఆడియో విడుదల కానుంది. తమన్నా హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు.