Updated 09:53 PM
ఇంతటి తో ఫంక్షన్ సమాప్తం. మా ప్రత్యేకమైన రెపొర్త్స్ మీకు నచ్చాయని ఆశిస్తున్నాం
Updated 09:50 PM
వెంకటేష్ స్టేజి మీద మాట్లాడుతున్నారు. తన ఫాన్స్ అందరికి వెంకటేష్ ధన్యవాదాలు తెలిపారు. "చాలా కాలం తరువాత నేను ఆడియో ఫంక్షన్ చేస్కుంటున్నాను. మీ అందరి మధ్యా చేస్కోవటం చాలా ఆనందం గా ఉంది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుంది. పని చేసిన సాంకేతిక నిపుణులు అందరికి నా ధన్యవాదాలు. మంచి చిత్రాన్ని తీస్కోచ్చినందుకు బెల్లంకొండ సురేష్ కు ధన్యవాదాలు" అని వెంకటేష్ తెలిపారు.
Updated 09:42 PM
వేదిక మీద పెద్దలు అందరు మాట్లాడుతున్నారు. అందరూ కుడా సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నారు.
Updated 09:28 PM
వినాయక గారు ఆడియో సి.డి. ని ఆవిష్కరించి ప్రభాస్ కి అందించారు. సి.డి.లను స్టేజి మీద ఉన్న పెద్దలందరికీ పంచుతున్నారు. ఫాన్స్ కేరింతల మధ్య కార్యక్రమం ఉత్సాహం గా జరుగుతోంది
Updated 09:18 PM
విచ్చేసిన పెద్దలను స్టేజి మీద కు ఆహ్వానిస్తున్నారు.మరి కాసేపట్లో ఆడియో ను లాంచనం గా విడుదల చేయబోతున్నారు
Updated 09:04 PM
ఇప్పటి వరకు నాలుగు పాటలు వినిపించారు..ఇప్పుడు తెర మీద పాటలను చూపిస్తున్నారు. వెంకటేష్ మరియు త్రిష చూడ చక్కగా ఉన్నారు.
Updated 08:54 PM
పాటలన్నీ కుడా మధురం గా అనిపిస్తున్నాయి. తమన్ భార్య ఒక పాట పాడారు. ఇప్పటి వరకు ఒచ్చిన పాటలు బాగున్నాయి.
Updated 08:43 PM
బాడీ గార్డ్ లోని రెండవ పాట స్టేజి మీద పాడుతున్నారు. పాట నెమ్మదిగా, వినసొంపుగా ఉంది.
Updated 08:30 PM
తమన్ స్టేజి మీద లైవ్ షో ఇవ్వనున్నారు. బాడి గార్డ్ చిత్రం లోని మొదటి పాట మన ముందుకు వస్తోంది
Updated 08:25 PM
వెంకటేష్ నట జీవితం లోని పాతిక సంవత్సరాల ప్రస్థానాన్ని చూపించారు. తాగుబోతు రమేష్ ఒక హాస్యాస్పదమైన ప్రదర్శన స్టేజి మీద ఇచ్చారు
Updated 08:15 PM
అక్ష స్టేజి పై వెంకటేష్ హిట్ చిత్రాల లో ని పాటలకు డాన్సు వేస్తోంది. ఫాన్స్ అందరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు..అక్ష చూడ చక్కటి డాన్సు చేస్తోంది
Updated 08:05 PM
హీరో ప్రభాస్ ఆడిటోరియం లో కి వచ్చేసాడు. అతడికి ఫాన్స్ ఘన స్వాగతం పలికారు. స్టేజి పై ప్రస్తుతం మేజిక్ షో జరుగుతోంది. అందరు కడుపుబ్బా నవ్వుతున్నారు
Updated 07: 55 PM
రానా దగ్గుబాటి మరియు వి.వి.వినాయక విచ్చేసారు.
Updated 07: 48 PM
ఆడిటోరియం లోనికి వెంకటేష్ మరియు రామానాయుడు గారు విచ్చేశారు. ఫాన్స్ వారికి ఎంతో ఉత్సాహం గా కేరింతలు మరియు విజిల్స్ తో స్వాగతం పలికారు. హీరోయిన్ త్రిష కూడా వచ్చేసారు. స్టేజి పై నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి
Updated 07: 40 PM
దిల్ రాజు, కే.ఎల్.నారాయణ, కార్తి, అనంత శ్రీరామ్ మరియు తమన్ ఆడిటోరియం లోకి విచ్చేశారు. ఝాన్సీ తో పాటు గా రఘు కారుమంచి కుడా స్టేజి పై ఆన్కోరింగ్ చేస్తున్నాడు.
Updated 07: 25 PM
ఝాన్సీ తెలంగాణా యాస తో మాట్లాడుతోంది.ప్రస్తుతం వివిధ దేశాల నుండి వచ్చిన కళాకారులు మేజిక్ షో చేస్తున్నారు. ఫాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
Updated 07: 18 PM
వాసు చిత్రం నుండి 'పాటకు ప్రాణం' అనే పాట కు సత్య మాస్టర్ బృందం నాట్యం చేస్తోంది. డాన్సు బాగా కంపోజ్ చేసారు. చూడటానికి ఎంతో బాగుంది.
Updated 07: 13 PM
"ఘన నాదాయ ఘన కిరీతాయ" పాట కు డ్యాన్సర్ లు నృత్యం చేస్తున్నారు. స్టేజి మీద ఒక భారి కమలం సెట్ వేసారు.డాన్సు చక్కగా ఉంది.
Updated 07: 05 PM
ఈ ఫంక్షన్ కు ఝాన్సీ ఆన్కోరింగ్ చేస్తోంది. వెంకటేష్ సూపర్ హిట్ పాటలు వెయ్యటం తో ఫాన్స్ పండుగ చేసుకుంటున్నారు. బయట ఉన్న విపరీతమైన ట్రాఫిక్ జాం నుండి అతిధులు మెల్లిగా ఆడిటోరియం లోపలి కి వస్తున్నారు
Updated 06: 45 PM
ఇక్కడ ఫాన్స్ హడావుడి తో ఆడిటోరియం అంతా కోలాహలం గా ఉంది. వేలాది మంది అభిమానులు ఇక్కడి చేరుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్ నటించిన పాత చిత్రాల లోని వీడియో పాటలను ప్రదర్శిస్తున్నారు
Updated 06: 40 PM
వందనం..మేము వెంకటేష్ నటించిన బాడీగార్డ్ చిత్రం ఆడియో ఫంక్షన్ వేదిక నుంది మీకోసం ప్రత్యక్షం గా అక్కడి విషయాలను తెలియచెస్తున్నాం. చూస్తూ ఉండండి
|